|


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా కోసం రచయిత కోన వెంకట్ పని మొదలు పెట్టారు. సినిమా స్టోరీ ఏమిటో చెప్పడానికి నిరాకరించిన కోన...తాను పవన్ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. డివివి దానయ్య నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.పవన్ కళ్యాణ్ కోసం దుమ్మురేపే కథను, డైలాగులను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక పోతే....పవన్ కళ్యాన్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాకు హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా శృతి హాసన్ పవన్ సరసన రొమాన్స్ చేయనుంది.
|