|

అదీ 'పంజా' ఓవర్ సీస్ బిజెనెస్ స్టామినా
పంజా ఓవర్ సీస్ బిజినెస్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపిందని అంటున్నారు ఈ చిత్రం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్. ఈ చిత్రం విడుదల గురించి అక్కడ ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇక హిట్,ఫ్లాప్ లు ప్రక్కన పెట్టి పవన్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ చిత్రం బిజినెస్ నిరూపించింది అని చెప్తున్నారు. డిసెంబర్ ఎనిమిది న ప్రీమియర్ షోలు వేయటం జరుగుతుందని చెప్పారు. ఇక పంజా టీ షర్ట్ లు, టోపీలు, సీడిలు ఎగ్జిబిటిర్స్ కు పంపిణి చేయటానకి సన్నాహాలు పూర్తి చేసామన్నారు.
ఇక ఇప్పటివరకూ ఓవర్ సీస్ మార్కెట్లో ఏ తెలుగు సినిమా రిలీజ్ కానటువంటి సెంటర్లలో సైతం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, యుస్ మాత్రమే కాకా డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్వీడన్ వంటి చోట్ల కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఇక పంజాకి చెందిన మిగతా వివరాలు, పోస్టర్స్ సినిమా వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే సౌకర్వం కలిగించామని అన్నారు. అడ్వాన్స్ గా ఆన్ లైన్ బుక్కింగ్,ప్రీమియర్ షో కు సైతం ఓపెన్ అయినట్లు తెలియబరిచారు. పవన్ జల్సా, ఖుషీ తరహాలో ఈ చిత్రం ఓ ఎంటర్టైనర్ అని తెలిపారు.
|