|
.jpg)
దొంగమొగుడు గా రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ వివివినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. మాస్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు వినాయక్. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో డబల్ రోల్ లో కనిపించనున్నాడని, గతంలో చిరంజీవి నటించిన దొంగమొగుడు, రౌడీ అల్లుడు సినిమాల ఆధారంగా ఈ సినిమా స్టోరీలైన్ ఉంటుందని అంటున్నారు.
రచయిత ఆకుల శివతో కథను రసవత్తంగా తయారు చేయిస్తున్న దర్శకుడు మరో వైపు సినిమాకు సాంకేతిక వర్గం, నటీనటులను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారు. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ చెర్రీ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
|