|

Gabbar Singh 1st look
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్' ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. బాలీవుడ్ లో విజయవంతమైన దబాంగ్ చిత్రం తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ అవుతోంది. 'మిరపకాయ్' ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ని దర్శక, నిర్మాతలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో..ఈ చిత్రంలో ఆయన అలా కనిపిస్తారు. 'గబ్బర్ సింగ్' గా పవన్ అభినయం ఇందులో కొత్త పుంతలు తొక్కుతుంది. పవర్ స్టార్ మార్క్ కామెడీకి కూడా ఈ సినిమాలో లోటు ఉండదు. ఇక శ్రుతిహాసన్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.హరీష్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన్ను దర్శకుడిగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు.
బాలీవుడ్ లో అనేక రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తెలుగులోకి మాస్ హిట్ కొడుతుందని దర్శక, నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'పంజా' చిత్రంలో గడ్డంతో కాక, పవన్ ఈచిత్రంలో సరికొత్త గ్లామర్ తో కన్పిస్తున్నాడు. కేరళ, పొల్లాచ్చి, హైదరాబాద్ ల్లో ఇప్పటికే షూటింగ్ జరిగింది.
పవన్ సరసన అందాల తార శ్రుతి హాసన్ నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పోలీస్ అధికారి పాత్రలో సల్మాన్ ఖాన్ కు ధీటుగా పవన్ ఈ చిత్రంలో నటించడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.
నాగబాబు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్.
|